మరింత ఈజీగా పెట్రోల్ పంపు ఏర్పాటు ..2019 లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు

మరింత ఈజీగా  పెట్రోల్ పంపు ఏర్పాటు ..2019 లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం  పెట్రోల్ పంపుల ఏర్పాటు నిబంధనలను మరింతగా సడలించాలని చూస్తోంది.  2019లో నిబంధనలు సడలించి, -ఆయిల్‌‌‌‌ యేతర కంపెనీలు కూడా పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మార్గదర్శకాలను సమీక్షించేందుకు సుఖ్మల్ జైన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంధన భద్రత, డీకార్బనైజేషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారిస్తుంది. ఆగస్టు 6న స్టేక్‌‌‌‌‌‌‌‌హోల్డర్ల నుంచి 14 రోజుల్లో సూచనలు కోరింది.