ప్రముఖ టెక్ కంపెనీ OpenAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్ వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను అరికట్టడానికి ఒక పవర్‌ఫుల్ ఆఫీసర్‌ను నియమించుకుంటోంది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే OpenAI ఈ 'హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్' పోస్టుకి ఏటా సుమారు $555,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 4.6 కోట్ల జీతం ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు కంపెనీ షేర్లు కూడా అదనంగా ఉంటాయి.
ప్రిపేర్డ్‌నెస్ పోస్ట్ అంటే ఏంటి ?
AI టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది. ఇది ఎంత ప్రయోజనకరమో తప్పుగా వాడితే అంత ప్రమాదకరం కూడా. అందుకే రాబోయే లేటెస్ట్ AI మోడల్స్ వల్ల సైబర్ దాడులు జరగకుండా లేదా ఇతర భారీ నష్టాలు కలగకుండా ముందుగానే జాగ్రత్త పడటమే ఈ విభాగం పని.
అలాగే కొత్త AI మోడల్‌ను ప్రజల్లోకి వదిలే ముందే దానివల్ల ఉండే ముప్పులను టెక్నికల్ గా పరీక్షించాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని అడ్డుకోవడానికి తగిన సేఫ్టీ చర్యలు రూపొందించాలి. ఇంజనీరింగ్, రీసెర్చ్, పాలసీ విభాగాలతో కలిసి పని చేస్తూ ఒక గట్టి సెక్యూరిటీ సిస్టం నిర్మించాలి.
►ALSO READ | ఛార్జింగ్ టెన్షనే లేదు! రియల్‌మీ నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. అదరగొడుతున్న కొత్త ఫీచర్స్..
ఇందుకు మెషిన్ లెర్నింగ్, AI సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ లేదా బయోసెక్యూరిటీ వంటి విభాగాల్లో మంచి అనుభవం ఉన్న వారి కోసం కంపెనీ ఇప్పుడు వెతుకుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోగల టీం లిడర్షిప్ లక్షణాలు ఉండాలి.
AI అనేది మనిషికి హాని చేయకూడదనే ఉద్దేశంతో, శామ్ ఆల్ట్‌మాన్ నాయకత్వంలోని OpenAI ఈ భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. టెక్ ప్రపంచంలో ఇది అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన ఉద్యోగంగా పరిగణించబడుతోంది.
