ఛార్జింగ్ టెన్షనే లేదు! రియల్‌మీ నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. అదరగొడుతున్న కొత్త ఫీచర్స్..

 ఛార్జింగ్ టెన్షనే లేదు! రియల్‌మీ నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. అదరగొడుతున్న కొత్త ఫీచర్స్..

స్మార్ట్ ఫోన్ & ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ రియల్‌మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 16 ప్రో 5Gని  ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. దీనికి సంబంధించి టీజర్లు ఎప్పటికప్పుడు విడుదలవుతునే ఉన్న, ఇప్పుడు కంపెనీ దాదాపు ఫోన్ అన్ని స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. రియల్‌మి 16 ప్రో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ 5G ప్రాసెసర్ పై రన్ అవుతుంది. దీనికి పెద్ద 7,000mAh బ్యాటరీని కూడా ఇచ్చారు. 

రియల్‌మి 16 ప్రో 5G స్పెసిఫికేషన్లు:
రియల్‌మి 16 ప్రో 5Gలో 144Hz రిఫ్రెష్ రేట్, 6500-నిట్ పీక్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ కలర్స్, లేటెస్ట్ ఐ ప్రొటెక్షన్ తో  1.5K AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ 5G చిప్‌సెట్, 970,000 పాయింట్లకు మించి AnTuTu స్కోర్‌ ఉంటుందని కంపెనీ పేర్కొంది.  మంచి పర్ఫార్మెన్స్  కోసం దీనికి ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్ సపోర్ట్  ఇచ్చారు.  

కెమెరా విషయానికి వస్తే రియల్‌మి 16 ప్రో 5Gలో 200-మెగాపిక్సెల్ లూమాకలర్ కెమెరా సిస్టమ్ ఉంది, ఇది హై-ఎండ్ రియల్‌మి 16 ప్రో+ 5Gలో కూడా ఉంటుంది. 21 స్పెషల్ పోర్ట్రెయిట్ టోన్స్ పరిచయం చేసే కొత్త వైబ్ మాస్టర్ మోడ్ కూడా ఉంది. వీడియోల కోసం   4K HDR రికార్డింగ్‌ సపోర్ట్ ఇచ్చారు. 

►ALSO READ | ఇంట్లో పెద్ద స్క్రీన్ పై సినిమాలకోసం..4K HDR వీడియో ప్రొజెక్టర్‌

రియల్‌మి 16 ప్రో 5Gతో పాటు కంపెనీ ప్రీమియం వేరియంట్‌ను కూడా విడుదల చేస్తోంది, అదే రియల్‌మి 16 ప్రో+ 5G. రియల్‌మి బడ్స్ ఎయిర్ 8  కూడా వీటితో పాటు లాంచ్ అవుతున్నాయి.

ఈ లాంచ్ ఈవెంట్ జనవరి 6న జరుగుతుంది అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. Realme 16 Pro 5G మోడల్ ధర తెలియనప్పటికీ Realme 16 Pro+ 5G ధర రూ. 43,999 ఉంటుందని అంచనా, అయితే డిస్కౌంట్, లాంచ్ ఆఫర్ తరువాత ధర మరింత తగ్గవచ్చు.