Gold Rate: శుభవార్త.. శ్రావణ సోమవారం కుప్పకూలిన గోల్డ్ రేటు.. షాపింగ్ ఆలస్యం వద్దు..

Gold Rate: శుభవార్త.. శ్రావణ సోమవారం కుప్పకూలిన గోల్డ్ రేటు.. షాపింగ్ ఆలస్యం వద్దు..

Gold Price Today: రక్షాభందంన్ తర్వాత బంగారం ధరలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా స్థిరపడటం, ఆందోళలను ఎదుర్కొనేందుకు మార్గాల అన్వేషణ ఇన్వెస్టర్లను ఒత్తిడి నుంచి బయటపడేస్తోంది. దీంతో సేఫ్ హెవెన్ బంగారం రేట్లు భారీగా తగ్గుతున్నాయి. షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తాము ఉంటున్న నగరాల్లో తగ్గిన రేట్లను ముందుగా గమనించటం ముఖ్యం. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7వేల తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 375, ముంబైలో రూ.9వేల 375,  దిల్లీలో రూ.9వేల 390, కలకత్తాలో రూ.9వేల 375, బెంగళూరులో రూ.9వేల 375, కేరళలో రూ.9వేల 375, పూణేలో రూ.9వేల 375, వడోదరలో రూ.9వేల 380, జైపూరులో రూ.9వేల 390, మంగళూరులో రూ.9వేల 375, అయోధ్యలో రూ.9వేల 390,  నాశిక్ లో రూ.9వేల 378, బళ్లారిలో రూ.9వేల 375, నోయిడాలో రూ.9వేల 390, గురుగ్రాములో రూ.9వేల 390 వద్ద కొనసాగుతున్నాయి. 

ALSO READ : రూ.1,279 నుంచే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7వేల 600 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 228, ముంబైలో రూ.10వేల 228,  దిల్లీలో రూ.10వేల 243, కలకత్తాలో రూ.10వేల 228, బెంగళూరులో రూ.10వేల 228, కేరళలో రూ.10వేల 228, పూణేలో రూ.10వేల 228, వడోదరలో రూ.10వేల 233, జైపూరులో రూ.10వేల 243, మంగళూరులో రూ.10వేల 228, అయోధ్యలో రూ.10వేల 243,  నాశిక్ లో రూ.10వేల 231, బళ్లారిలో రూ.10వేల 228, నోయిడాలో రూ.10వేల 243, గురుగ్రాములో రూ.10వేల 243గా ఉన్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.93వేల 750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 2వేల 280గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 27వేల వద్ద ఉంది.