పాతపద్దతిలోనే టెన్త్ పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

పాతపద్దతిలోనే టెన్త్ పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో మార్పులపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న  విద్యాశాఖ ఆ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

పదో తరగతి పరీక్షల్లో మార్పులపై తెలంగాణ విద్యాశాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇటీవల టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల తొలగింపు, గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది విద్యాశాఖ. ఈసారి పరీక్షల్లోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. అయితే కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే విద్యాశాఖ వెనక్కి తగ్గింది. తాజాగా సవరణ ఉత్తర్వులను జారీ చేసింది.

2025-26 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పదవ తరగతి పరీక్షల్లో 80శాతం ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్, 20శాతం ఇంటర్నల్ అసెస్మెంట్ పాత మార్కుల విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ప్రస్తుతం విధానంలో పబ్లిక్ (ఎక్స్ టర్నల్)) పరీక్షలు – 80 మార్కులు,ఇంటర్నల్ అసెస్మెంట్ – 20 మార్కులు, మొత్తం ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు..  6 సబ్జెక్టులకు 600 మార్కులు. గ్లోబల్ (గ్రేడింగ్) విధానాన్ని రద్దు చేసి మార్కుల మేరకు ఫలితాలు ప్రకటించేలా మార్పులు చేశారు. 

గతంలో ప్రభుత్వం ఇంటర్నల్ మార్కులు, గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసి, 100 విలువ పూర్తి పరీక్షకు కేటాయించాలనుకుంది. కానీ విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యంతరాలు వెల్లువెత్తడంతో పాత విధానాన్ని 2025-26 నుంచి కొనసాగించనున్నట్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..

  • 2025-26 నుంచి 20 మార్కుల ఇంటర్నల్ అసెస్మెంట్ ను కొనసాగిస్తారు
  • 80 మార్కులు వార్షిక (ఫైనల్) పరీక్షలకు ఉన్నాయి
  • ఫలితాల్లో ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ (Pass/Fail తో పాటు) ముద్రించనున్నారు
  • విద్యార్థి అకడమిక్ పనితీరుకు సంబంధించి ఇంటర్నల్ మార్కులు కొనసాగుతాయి.