IndiGo: అంతా నార్మల్.. ఇండిగో విమానాలు మళ్లీ ఎగురుతున్నాయ్..ప్యాసింజర్లకు రూ.827 కోట్ల పరిహారం

IndiGo: అంతా నార్మల్.. ఇండిగో విమానాలు మళ్లీ ఎగురుతున్నాయ్..ప్యాసింజర్లకు రూ.827 కోట్ల పరిహారం

ఎట్టకేలకు ఇండిగో సంక్షోభానికి తెరపడింది. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు తిరిగి ఎగురుతున్నాయి. దాదాపు 1800 ఫ్లైట్లు దేశ విదేశాలకు ప్రయాణం ప్రారంభించాయి. వారం రోజులపాటు ప్లైట్ క్రైసిస్  తో విమానాల రద్దు, సాంకేతిక లోపంతో లగేజీ చేతికందక నానా ఇబ్బందులు పడ్డ  ప్యాసింజర్లకు కొంత ఊరట లభించింది. అంతేకాదు ప్రయాణికులకు చెల్లించాల్సిన రూ. 827కోట్ల రీఫండ్ చెల్లించింది.  మిగతావి డిసెంబర్ 15 లోపు సెటిల్ చేస్తామని ప్రకటించింది. 

సోమవారం ( డిసెంబర్ 8)  ఇండిగో 90శాతం విమానాలు  సేవలు ప్రారంభించాయి. ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ కు చెందిన 1800 విమానాలలలో 16వందల 50 విమానాలు  పనిచేశాయి. ఎయిర్ లైన్స్ మొత్తం నెట్ వర్క్ లో 90 శాతం ఆన్ టైమ్ పెర్మార్మెన్స్ ను రిపోర్టు చేశాయి. మా నెట్ వర్క్ పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమైందని ఇండిగో సంస్థ ప్రకటించింది. 

సోమవారం నడవాల్సిన విమానాల షెడ్యూల్ ను ఇండిగో సంస్థ నిన్న నే ప్రకటించింది. తద్వారా ప్రయాణికులను నోటిఫికేషన్ పంపించింది. ఇప్పటికే రూ.827 కోట్లు రీఫండ్ చేశామని, డిసెంబర్ 15 నాటికి అన్ని రిఫండ్ అవుతాయని  సంస్థ తెలిపింది. 

ఇటీవల పైలట్ల డ్యూటీ షెడ్యూల్ పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)  కొత్త విమాన విధి విధానాలను  ప్రకటించింది.  అయితే సవరించిన కొత్త ప్రకారం..ఇండిగో సిబ్బందిని షెడ్యూల్ చేయడంలో విఫలమైంది. దీంతో డిసెంబర్ 1 నుంచి  7 వరకు  ప్రయాణికులు ఎయిర్ పోర్టులలో నిరీక్షించాల్సి వచ్చింది. ఇండిగో ఫ్లైట్ సంక్షోభం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే  DGCA కొత్త భద్రతా నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. 

ఇండిగో రీఫండ్  కోసం.. 

రీఫండ్ లపై అప్ డేట్ ఇచ్చిన ఇండిగో డిసెంబర్ 3నుంచి డిసెంబర్ 15 మధ్య రద్దు చేయబడిన విమానాలకు రీఫండ్ ఇప్పటికే చెల్లింపులు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్యాసింజర్లకు  రిక్వెస్ట్ లపై పూర్తి మినహాయింపు ఉంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. 

చిక్కుకుపోయిన కస్టమర్లకోసం.. 

డిసెంబర్ 1 నుంచి 7 వరకు విమానాల రద్దుతో అనేక విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన కస్టమర్లకు సాయం అందించినట్లు ఇండిగో తెలిపింది. 9వేల 500 పైగా హోటల్ గదులను బుక్ చేసింది. దాదాపు 10వేల క్యాబులు, బస్సుల ద్వారా కస్టమర్లను ఇళ్లకు చేర్చింది. 4వేల 500 కంటే ఎక్కువ కస్టమర్లకు సంబంధించిన లగేజీని డెలివరీ చేసింది. మిగిలిన వారికి రాబోయే 36 గంటల్లో డెలివరీ చేస్తామని తెలిపింది.వివిధ కమ్యూనికేషన్ల ద్వారా ప్రతి రోజు 2 లక్షల మందికిపైగా కస్టమర్లకు సాయం చేసినట్లు ఎయిర్ లైన్ తెలిపింది. 

ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం.. 

ఇండిగో సంక్షోభంపైకేంద్రం దర్యాప్తు ప్రారంభించిందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం తెలిపారు.ఇండిగో రోస్టరింగ్ వ్యవస్థ లోపాలతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఇండిగో ఉద్దేశ్యపూర్వకంగాన విమానాలను రద్దు  చేసిందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పైలట్లు డ్యూటీ చేసేందుకు రెడీగా ఉన్నా సంస్థ నిరాకరించిందని అన్నారు. అయితే  దీనిపై ఇండిగో సంస్థ ఇంకా స్పందించలేదు.