IPL 2026 Auction: దేశమే ముఖ్యమనుకున్నాడు: ఇంగ్లాండ్ క్రికెటర్‌పై బీసీసీఐ బ్యాన్.. 2026 మినీ ఆక్షన్‌కు దూరం

IPL 2026 Auction: దేశమే ముఖ్యమనుకున్నాడు: ఇంగ్లాండ్ క్రికెటర్‌పై బీసీసీఐ బ్యాన్.. 2026 మినీ ఆక్షన్‌కు దూరం

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ మినీ ఆక్షన్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2026 ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు బ్రూక్ ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. రూల్స్ ప్రకారం "వేలంలో రిజిస్టర్ చేసుకుని ఎంపికైన తర్వాత, సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా పోయిన ఏ ఆటగాడినైనా 2 సీజన్ల పాటు టోర్నమెంట్ లో వేలంలో పాల్గొనకుండా నిషేధించబడతారు". హ్యారీ బ్రూక్ వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడాలనుకున్నా అతనిపై బీసీసీఐ నిషేధం విధించడంతో మినీ ఆక్షన్ కు దూరం కానున్నాడు.      

ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2025 ఐపీఎల్ సీజన్ ముందు అర్ధాంతరంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో బ్రూక్ పై రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా బ్యాన్ చేసింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ 2025 సీజన్ తో పాటు 2026 ఐపీఎల్ లో ఆడడానికి వీలు లేదు. వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత.. ఆ ఆటగాడు గాయపడితే తప్ప ఇతర ఏ కారణంతో విదేశీ ఆటగాళ్లు వైదొలిగినా రెండేళ్ల నిషేధం తప్పదని ఐపీఎల్ నియమనిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈ రూల్ విధించిన తర్వాత నిషేధం ఎదర్కొన్న తొలి ఆటగాడు బ్రూక్. 

బ్రూక్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. ఐపీఎల్ తర్వాత జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ తో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఈ సిరీస్ పైనే బ్రూక్ తన పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ ను రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ నుంచి తనకు తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కు బ్రూక్ క్షమాపణలు తెలిపాడు.