IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20: అర్షదీప్, హర్షిత్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20: అర్షదీప్, హర్షిత్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మంగళవారం (డిసెంబర్ 9) జరగనుంది. కటక్ వేదికగా బారబత్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ముందు ఇండియా ఆడుతున్న ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకొని టీమిండియా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సౌతాఫ్రికా టీమిండియాకు సొంతగడ్డపై షాక్ ఇవ్వాలని చూస్తోంది. తొలి టీ20కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..     

ఈ సిరీస్ లో అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. వైస్ కెప్టెన్, ఓపెనర్ కావడంతో అభిషేక్ తో గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, సంజు శాంసన్ ఆడతారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఆడిన జితేష్ బెంచ్ కే పరిమితం కావచ్చు. శివమ్ దూబే, హార్దిక్ పాండ్య ఆల్ రౌండర్లతో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్ ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ లేదా సుందర్ లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది.

అక్షర్ పైనే జట్టు యాజమాన్యం ఎక్కువగా మొగ్గు చూపించవచ్చు. ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఫాస్ట్ బౌలర్ గా కొనసాగే అవకాశాలున్నాయి. అర్షదీప్ సింగ్, హర్షిత్ రానాలకు నిరాశ తప్పకపోవచ్చు. ఐదు టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ 6:30 గంటలకు వేస్తారు. లైవ్ టెలికాస్ట్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్.. లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో చూడొచ్చు.

సౌతాఫ్రికాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)*, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్,  సంజు శాంసన్ (వికెట్-కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్