Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 'ఫిట్టింగ్'.. 14వ వారం కెప్టెన్‌గా భరణి.. సంజనకు హౌస్‌మేట్స్ షాక్!

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 'ఫిట్టింగ్'.. 14వ వారం కెప్టెన్‌గా భరణి.. సంజనకు హౌస్‌మేట్స్ షాక్!

బుల్లితెర రియాలిటీ షో ' బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' క్లైమాక్స్ కి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫినాలే జరగనుంది. ఈ వారం హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య డ్రామా, ఎమోషన్స్, టాస్క్ లో పాయింట్ల కోసం తీవ్రమైన పోరాటం నడుస్తోంది. 14వ వారం తొలి రోజు బిగ్ బాస్ ట్విస్ట్  ఇచ్చారు. హౌస్‌మేట్స్‌కు ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టారు . ఈ టాస్క్ వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాలను, అసలైన గేమ్ ప్లాన్‌ను బయటపెట్టింది.

భరణి కెప్టెన్సీ కల సాకారం!

ఫ్యామిలీ వీక్‌లో తన కూతురు వచ్చి "నువ్వు కెప్టెన్ అవు డాడీ" అని అడిగింది. కానీ ఆ తర్వాత ఆ కోరిక తీర్చలేకపోయినందుకు భరణి చాలా ఫీల్ అయ్యాడు. అయితే పదమూడో వారం ఎలిమినేషన్ తరువాత.. ఎట్టకేలకు భరణి ఆ కోరికను నెరవేరింది. ఈ పద్నాలుగో వారం భరణి కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. ఫినాలే ముందు వారంలో కెప్టెన్సీ దక్కడం, ప్రేక్షకులకు అతనిపై మరింత సానుభూతిని పెంచవచ్చని లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతోంది

'ఫిట్టింగ్' పెట్టిన బిగ్ బాస్

బిగ్‌బాస్ ఈ వారం హౌస్‌మేట్స్ లోని కళ్యాణ్‌ మినహా మిగిలిన ఆరుగురికి ఆరు బాక్సులను పంపించాడు. వాటిలో 0 నుంచి రూ. 2,50,000 వరకూ వివిధ పాయింట్లు,అమౌంట్స్ ఉన్నాయి. ఈ సీజన్‌లో వారి ఆట, ప్రతిభ, కాంట్రిబ్యూషన్ ఆధారంగా ఈ పాయింట్లు ఎవరికి దక్కాలో హౌస్‌మేట్స్ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోవాలి. బిగ్ బాస్ స్పష్టంగా.. మీరు ఇంకొకరికి ఇచ్చే బాక్సుల విలువ వారు ఈ సీజన్‌లో కనబరిచిన ప్రదర్శన చేసిన కాంట్రిబ్యూషన్‌ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి... మీ హక్కు కోసం మీ గళాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఇది అని చెప్పాడు.

ఇమ్మానుయేల్‌కు అత్యధిక పాయింట్లు..

 రేసులో లేని కళ్యాణ్ బాల్ అందుకొని మొట్టమొదటి నిర్ణయాన్ని ప్రకటించాడు. అందరికంటే ఎక్కువ ప్రశంసలు అందుకున్న ఇమ్మానుయేల్‌కే అత్యధిక మొత్తం అయిన రూ. 2,50,000 దక్కాలని నిర్ణయించాడు. దీనికి మిగిలిన హౌస్‌మేట్స్ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అనంతరం బాల్ అందుకున్న ఇమ్మానుయేల్, అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంజన (Sanjana Galrani) కోసం గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు. "ఫిజికల్‌గా ఆవిడకి అయినంతవరకూ ఆడినా మెంటల్‌గా మాత్రం సూపర్ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది... 14వ వారం వరకూ వచ్చారంటే ఆడియన్స్‌కి ఆమె గేమ్ నచ్చి ఉంటుంది. నాకు రూ. 1,50,000 ఆమెకి ఇవ్వాలనిపిస్తుంది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

 సంజనకు వ్యతిరేకంగా హౌస్‌మేట్స్

అయితే  ఇమ్మానుయేల్ సపోర్ట్‌ను హౌస్‌మేట్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. సంజనతో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అని నేను ఫీల్ అవుతాను కాబట్టి నేను సపోర్ట్ చేయట్లేదు అని స్పష్టం చేశారు.  ఇక డీమాన్ పవన్ కూడా..  ఓవరాల్‌గా పర్సనాలిటీ, టాస్కుల విషయానికొచ్చినా కూడా ఆవిడకన్నా నేను అర్హుడ్ని అని నేను భావిస్తున్నాను అని వ్యతిరేకించారు. అటు తనూజ సహితం ఇమ్మూ మద్దతుకు సపోర్టు చేయలేదు.  సంజన  కన్నా అర్హులు ఉన్నారని నేను అనుకుంటున్నాను తేల్చి చెప్పింది.

దీంతో సంజనా కోసం ఇమ్మానుయేల్ తీసుకున్న ప్రయత్నం విఫలమైంది. హౌస్‌మేట్స్ వ్యతిరేకత కారణంగా, సంజనకు చివరికి సున్నా  ఉన్న బాక్స్ మాత్రమే దక్కింది. ఈ పరిణామంతో ఆమెను జైలుకు పంపినట్లు సమాచారం. మొట్టమొదటిసారి ఇమ్మానుయేల్ సంజన కోసం నిలబడ్డా, డీమాన్, భరణి, తనూజ గట్టిగా అడ్డుకోవడంతో సంజన ఎమోషనల్ అయింది.