జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో నమోదైన భూకంపంతో భారీ ప్రకంపనలు సంభవించినట్లు జపాన్ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. సోమవారం (డిసెంబర్ 08) సాయంత్రం సంభవించిన భూకంపానికి సంబంధించి.. భూకంప కేంద్రం ఆమోరి (Aomori) తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో.. 50 కి.మీ.లోతులో ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. 

భారీ భూకంపం కారణంగా జాపాన్ ఈశాన్య తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది జపాన్ వాతావరణ సంస్థ (JMA). తీర ప్రాంతంలో అలలు 10 ఫీట్లు (3 మీటర్లు) ఎత్తుకు ఎగసిపడినట్లు పేర్కొంది. 

హొక్కయిడో, ఆమోరి, ఇవాతె పరిసర ప్రాంతాలకు సునామీ ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. జపాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాలలో భారీ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది.