డ్యూటీదిగి ఇంటికి వెళ్తుండగా గుండెపోటు..ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

డ్యూటీదిగి ఇంటికి వెళ్తుండగా గుండెపోటు..ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

అప్పటి వరకు ఉత్సాహంలో డ్యూటీ చేశాడు. డ్యూటీ దిగి ఇంటిచేరుకున్నాడు.. ఇంతలోనే అనారోగ్యం.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు ..అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది..గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్  మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.   

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న ఎర్రోజు దేవేందర్ (53) సోమవారం ( డిసెంబర్ 8) గుండెపోటుతో మృతిచెందారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న దేవేందర్ ఇంటి గుమ్మంలోనే  కుప్పకూలాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న దేవేందర్ ను  కుటుంబ సభ్యులు సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే  దేవేందర్ మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.  దేవేందర్ ఆకస్మిక మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

1992లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన దేవేందర్.. తర్వాత సివిల్ పోలీసు కానిస్టేబుల్‌గా కన్వర్ట్ అయ్యారు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ ..మృతుడు దేవేందర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ మృతిపట్ల కరీంనగర్ కమిషనర్ గౌష్ ఆలం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబానికి సంతాపం తెలిపారు.