నట సింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులు పూర్తి నిరాశలో ఉన్నారు. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూసిన అఖండ 2: తాండవం సడెన్గా వాయిదా పడి అందరికీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రావాల్సిన అఖండ 2, ఆర్థిక సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేయడానికి నిర్మాతలు కృషి చేస్తోన్నారు.
అయితే, రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం సినీ అభిమానులకు స్పష్టత రావడం లేదు. ఒకరు డిసెంబర్ 12 అని, మరొకరు డిసెంబర్ 25 అని.. ఇంకొందరు అయితే.. 2026 జనవరి అని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి అతి దగ్గరగా ఉన్నోళ్ల నుంచి అసలైన టాక్ బయటికొచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అఖండ 2 ఈ శుక్రవారం డిసెంబర్ 12, 2025న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇంకా ఈ విషయంపై నిర్మాతల నుంచి అధికారిక సమాచారం లేదు. ఈ క్రమంలోనే, అఖండ 2 నిర్మాతల ఫైనాన్షియల్ ఇష్యూ అలోమోస్ట్ క్లియర్ అయినట్టే అని, లేటెస్ట్గా టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గురువారం ప్రీమియర్స్, శుక్రవారం (డిసెంబర్ 12) సినిమా రిలీజ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
►ALSO READ | KAANTHA OTT Officially: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అలాగే, భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 ఆగిపోవడంతో పెద్దగా నష్టం ఏముండదని అన్నారు. సినిమా రిలీజ్ ఆలస్యమైనంత మాత్రాన దాని ఫలితంపై ప్రభావం పడదని, దానికి వచ్చే ఓపెనింగ్స్ అలానే ఉంటాయని అన్నారు. కాకపోతే ముందు చెప్పిన తేదీకే విడుదలైతే ఆ రోజు రిజల్ట్ మరింత గ్రాండ్గా ఉండేదని.. సో, ఈ ఇష్యు వల్ల రూ.3 నుంచి రూ.4 కోట్లు వసూళ్లు తేడా రావొచ్చంతే అని నిర్మాత తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో.. బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
డిసెంబర్ 12 రిలీజ్ సినిమాలు:
ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే సెలెక్ట్ చేసిన మల్టీప్లెక్స్‌లలో కూడా డిసెంబర్ 12 చూపిస్తుంది. అందువల్ల ఈ తేదీకే సినిమా వస్తుందని, ఏ టైంలో అయిన అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని టాక్ ఊపందుకుంది. అయితే, ఇదే డేట్ కనుక అఖండ 2 ఫిక్స్ చేసుకుని థియేటర్లోకి వస్తే మాత్రం.. మరిన్ని సినిమాలను రిస్క్లో పెట్టేలా కనిపిస్తోంది.
ఈ వారం డిసెంబర్ 12న పీపుల్ మీడియా నిర్మించిన మోగ్లీ, నందు హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ కూడా ఉంది. ఈ సినిమాను సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయి మూవీ హీరో నటించిన ‘ఈషా’ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ పెద్దనిర్మాతల సినిమాలు ఉండటం వల్ల.. అఖండ 2 డిసెంబర్ 12న వస్తుందా? లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
