జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు.. రాశులకు చాలాప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు స్థానచలనం కలిగినప్పుడు వ్యక్తుల జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. 2025 డిసెంబర్ 7 వ తేది రాత్రి 7.26 గంటలకు.. శక్తి, ధైర్యం, సాహసానికి కారకుడైన కుజుడు .... ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో 2026 జనవరి 14 వరకు సంచరిస్తాడు.
ధనస్సు రాశిని గురుడు పాలిస్తాడు. గురువు.. జ్ఞానం, ప్రయాణాలకు సంబంధించినది. కుజుడు... ధనస్సు రాశిలోకి రావడం వల్ల అగ్ని తత్వం పెరిగి.. వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం, చొరవ, ఆశయాల ప్రయత్నాలు పెరుగుతాయి. ఈ గోచారం అందరికీ కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. ముఖ్యంగా 5 రాశులకు అద్భుతమైన మేలు చేస్తుంది. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .
మేష రాశి : ధనుస్సు రాశిలోకి కుజుడి ప్రవేశం కారణంగా..ఈ రాశి వారికి ప్రత్యేక యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఊహించని విధంగా సంపద సమకూరుతుంది. దీర్ఘకాలిక కోరికలను కూడా నెరవేరుస్తుంది.కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తీసుకువస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఆశించిన వనరుల నుండి ఆర్థిక సహాయం, రుణాలు పొందుతారు.
మిథున రాశి : ఈ రాశి వారికి విజయాల పరంపర కొనసాగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి కూడా కలిసి వస్తుంది.
సింహ రాశి : కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంవలన ఈరాశి వారికి అదృష్టం వరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేస్తారు.
తోబుట్టువుల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆదాయం కూడా ఊహించని విధంగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వస్త్ర సంబంధిత వ్యాపారం కలిసి వస్తుంది. భూమికి సంబంధించిన పెట్టుబడులు కూడా ఆశించిన లాభాలను తీసుకువస్తాయి.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ప్రశంశలు.. అవార్డులు అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారం అభివృద్ది జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహితలు తమ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి : కుజుడు .. ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో .. ఈ రాశి వారికి కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నత పదవులు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉన్నత అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. గ్రూప్ చర్చల్లో మీరే కీలక పాత్ర పోషిస్తారు. సహోద్యోగుల మద్దతు .. మీ వృద్ధికి సహాయపడుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం బాగా కలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
