2047 నాటికి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ: మంత్రి వాకిటి శ్రీహరి

2047 నాటికి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-  2047 లో భాగంగా రైతుల ఆదాయ వనరుల అభివృద్ధి కి తీసుకోవలసిన చర్యల పై  జరిగిన సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక,మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీహరి. గోదావరి,కృష్ణ నదుల మధ్య ఉన్న తెలంగాణలో నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 26 వేల నీటి వనరులు కలిగిన తెలంగాణ మత్స్య సంపద ఉత్పత్తికి చాలా అనుకూలమైన ప్రదేశం అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్లు చెరువులల్లో 122 కోట్ల బడ్జెట్ తో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

చెరువులలో చేప పిల్లలను ఒక నిష్పత్తి ప్రకారం వదలటం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం 8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని... మత్స్య సంపద ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. తెలంగాణ చేపను ఒక బ్రాండ్ గా ప్రపంచానికి  పరిచయం చేస్తామన్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర మత్స్య సంపదను అగ్ర బాగానానిలబెడతామని తెలిపారు. మత్స్య పరిశ్రమలో ఐదు లక్షల కుటుంబాలు జీవనోపాధికొనసాగిస్తున్నాయని అన్నారు మంత్రి శ్రీహరి. 

పాల ఉత్పత్తిలో విజయ డైరీని మరింత ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్రంలో రోజుకు 95 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ప్రస్తుతం 35 లక్షల లీటర్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని తెలిపారు. దీనిని అధిగమించడానికి రైతులకు పాల ఉత్పత్తి పెంచే గేదెలను ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. 

2047 నాటికి పాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి సరిపోయి మిగతా పాలను దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డైరీ సెక్టార్ లో బిజినెస్ కు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పాల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు.