'ఏం పిల్లో ఏంపిల్లోడో' (2009) చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది బెంగుళూరు బ్యూటీప్రణీత సుభాష్.. తక్కువ సమయంలోనే వరుసగా అవకాశాలు దక్కించుకుంది. కేవలం నటనతోనే కాక, తన అందం, హుందాతనంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ ముద్దుగుమ్మ.
తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ప్రణీత ఎదిగింది. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి 'బ్రహ్మోత్సవం', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'అత్తారింటికి దారేది', యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'రభస', సిద్ధార్థ తో 'బావ' వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించి మెప్పించింది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈమె కెరీర్ మెయిన్ హీరోయిన్‌గా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా నటించింది, అయినప్పటికీ తన పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. తెలుగుతో పాటు, ప్రణీత కన్నడ, తమిళ భాషల్లోనూ తనదైన ముద్ర వేసింది. హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ, అవి అంతగా విజయవంతం కాలేదు. కానీ, దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగులో ఈమెకు మంచి గుర్తింపు ఉంది.
2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్న తర్వాత ప్రణీత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తన ఫ్యామిలీ లైఫ్, పిల్లలకు సంబంధించిన క్యూట్ అప్‌డేట్స్‌తో పాటు, తన గ్లామరస్ ఫొటోషూట్‌లను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆమె ఫిట్‌నెస్, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు నిరూపిస్తున్నాయి.
తాజాగా, ప్రణీత సుభాష్ 'రాయల్ స్టైల్ ఫ్యాషన్ షో'లో పాల్గొని ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోయింది. ఆమె ధరించిన రెడ్ అండ్ గోల్డ్ స్వచ్ఛమైన హ్యాండ్‌వోవెన్ సిల్క్ కాంచీవరం చీర వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రెడిషనల్ అవతార్‌లో ఆమె హుందాగా, అద్భుతంగా కనిపించింది. ప్రణీతకు సంబంధించిన ఈ లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె క్లాసిక్ లుక్‌ను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వైవాహిక జీవితంలో స్థిరపడ్డా, పబ్లిక్ ఈవెంట్స్‌లో తన చరిష్మాను కొనసాగిస్తూనే ఉంది ఈ అందాల తార.
