మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త కార్.. స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్లతో అదిరిందిగా..

  మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త కార్.. స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్లతో అదిరిందిగా..

నిస్సాన్ కంపెనీ  కొత్త మిడ్-సైజ్ SUV  కైట్ కారును  బ్రెజిల్‌లో లాంచ్  చేసింది. 2026 సంవత్సరం నుండి దీనిని 20కి పైగా ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. నిస్సాన్ కిక్స్, మాగ్నైట్ తర్వాత నిస్సాన్ పోర్ట్‌ఫోలియోలో కొత్త కైట్ ఒక ముఖ్యమైన మోడల్ కానుంది. దీనికి కొత్త స్టైలింగ్, కొత్త పేరు పెట్టారు. ప్రస్తుతం దీని తయారీ బ్రెజిల్‌లోని రెసెండే ప్లాంట్‌లో మొదలైంది.

 కైట్ డిజైన్‌: షార్ప్ డిజైన్‌తో  స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు,  కొత్త LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ఉన్నాయి. పెద్ద గ్రిల్ అలాగే కింది భాగంలో వెడల్పుగా ఉన్న ఎయిర్ ఇన్‌టేక్ కనిపిస్తుంది. కారు సైడ్ లుక్ చాలావరకు కిక్స్ (Kicks) SUVలాగ ఉంటుంది, కానీ స్పోర్టీ లుక్ కోసం కొత్త అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు. వెనుకవైపు షార్ప్ టెయిల్-ల్యాంప్‌లు ఉన్నాయి. 'KAIT' అనే పేరు కారు వెనుక డోర్‌పై  చూడొచ్చు. కానీ  నంబర్ ప్లేట్‌ను బంపర్‌పైకి మార్చారు.నిస్సాన్ కైట్  4,304 మిల్లీమీటర్లు పొడవు, వెడల్పు 1,760 mm, ఎత్తు 1,611 mm, వీల్‌బేస్ 2,620 mm, బూట్ స్పేస్  432 లీటర్లు

కైట్ ఇంటీరియర్  & ఫీచర్లు: 
కారు లోపలి భాగం నలుపు రంగు థీమ్‌తో ఉంటుంది. డాష్‌బోర్డ్ లేఅవుట్ పాత మోడళ్లగా  ఉన్నా, కొత్తగా డిజైన్ చేసిన ఎయిర్ కండిషనింగ్ వెంట్లు, గేర్ సెలెక్టర్ ఉన్నాయి. వెనుక సీట్లు 60:40 స్ప్లిట్-ఫోల్డ్ ఫీచర్‌తో వస్తాయి అంటే అవసరాన్ని బట్టి సీట్లను మడతపెట్టవచ్చు.

ముఖ్య ఫీచర్లు:
 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, పయనీర్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ దీనిలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. అప్‌గ్రేడ్ చేసిన సీట్ కవర్లు, ఆటోమేటిక్ డిజిటల్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

 ఇంజన్ వివరాలు:
 కైట్, నిస్సాన్ కిక్స్ తయారీకి ఉపయోగించిన V-ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. 1.6-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్  110 హార్స్‌పవర్ (hp) శక్తిని, 146 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.