
గ్రహాలలో గురుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బృహస్పతి ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి, నక్షత్రాన్ని మారుస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు ఆగస్టు 13నపునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. . ఈ సంవత్సరం చివరి వరకు గురుడు ఈ నక్షత్రంలో ఉంటాడు. గురుడు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం వస్తుంది. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
మేషరాశి : గురుడు .. పునర్వసు నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. గతంలో విబేధించిన వారు ఇప్పుడు మీ దగ్గరికే వస్తారు. వ్యాపారస్తులకు .. చేతి వృత్తుల వారికి అనుకోని లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులు.. కార్యాలయంలో మీరే ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు .. ప్రాజెక్ట్లు ప్రారంభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురుడు పునర్వసు నక్షత్రంలో సంచరించే సమయంలో కెరీర్ పరంగా ఉన్నసమస్యలు తొలగిపోతాయి. ఏ పని మొదలు పెట్టినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా సాగిపోతాయి. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. పెళ్లి కోసం ఎదురుచూసే వారికి అనుకున్న సంబంధం నిశ్చయం అవుతుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో ఎలాంటి పని అయినా సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే.. ఆఫీసులో మీరు ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో చర్చలు సఫలం అవుతాయి. మీకు ఆకర్షణ పెరగడంతో పాటు .. మీరు తీసుకొనే నిర్ణయాన్ని ఆఫీసులో అందరూ అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
మీనరాశి: గురు గ్రహం పునర్వసు నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎంతో కాలంగా వేధిస్తున్న పరిష్కారం లభించడంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులు ఒక్కసారిగా లాభాల బాటలో పయనిస్తారు. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. కెరీర్ లో ఉన్నతస్థానం పొందుతారు. స్నేహితులు.. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేపట్టిన అన్ని పనులు పూర్తికావడంతో ఉత్సాహంగా గడుపుతారు.