ముస్లింలకు ఏపీ సర్కార్ ఇఫ్తార్ పార్టీ

ముస్లింలకు ఏపీ సర్కార్ ఇఫ్తార్ పార్టీ

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లింలకు ఇఫ్తార్ వింధును ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. గుంటూరు లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులో పాల్తొనటం సంతోషంగా ఉందన్నారు. దేవుడు ఎంతో గొప్ప పని చేశాడని.. చాలా బాగా స్క్రిప్ట్ రాశాడని జగన్ అన్నారు.

2014 ఎన్నికలలో 67మంది YSRCP నుంచి MLAలుగా గెలిస్తే వారిలో 23మందిని అప్పటి సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారని, అలాగే.. 9 మంది YSRCP MPలలో ముగ్గురిని టీడీపీలో చేర్చుకున్నారని జగన్ అన్నారు. 2019 ఎన్నికలలో దేవుడు రాసిన స్క్రిప్ట్ కు టీడీపీ పత్తాలేకుండా పోయిందని చెప్పారు. రంజాన్ మాసంలో ఎన్నికల ఫలితాలు రావడం సంతోషంగా ఉందని అన్నారు జగన్.

గతంలో తన పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 23 అని ఇప్పడు టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 23 అని అన్నారు జగన్. MPల సంఖ్య కూడా అంతేనని అప్పుడు ముగ్గురిని కొనుగోలు చేస్తే.. ఇప్పుడు టీడీపీకి ముగ్గురే మిగిలారని చెప్పారు జగన్.

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా సుపరిపాలన అందజేస్తానని అన్నారు జగన్. 2019 ఎన్నికలలో ఐదుగురు ముస్లిం క్యాండిడేట్లకు టికెట్లు ఇస్తే నలుగురు గెలిచారని అన్నారు. కేవలం ఇక్బాల్ మాత్రమే ఓడిపోయాడని.. అతన్నికూడా MLC చేస్తానని చెప్పారు జగన్.