ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దాంతో మళ్లీ పాత పద్ధతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. కాగా, మునుపటి జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండర్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదం ఐదుగురితో సిట్
ఇదిలావుంటే, తిరుమల కొండలపై టీటీడీ ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాల 'వకుళామాత'ను ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం(అక్టోబర్ 05) ప్రారంభించారు. తొమ్మిది రోజుల వార్షిక ఘట్టమైన బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున చంద్రబాబు తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. 2025కి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్, డైరీని కూడా ఏపీ సీఎం ఆవిష్కరించారు.
VIDEO | Andhra Pradesh CM Chandrababu Naidu (@ncbn) offered prayers at #Tirumala Temple, Tirupati, earlier today.
— Press Trust of India (@PTI_News) October 5, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/wgnnSDrDpn