వైజాగ్ : కేసిఆర్ సపోర్ట్ తీసుకుని ప్రత్యేక హోదాకు కృషి చేస్తామని జగన్ మాట్లాడటం అవమానకరమన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం వైజాగ్ లో మాట్లాడరు. చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఏపీకి చారిత్రక అవసరం అని తెలిపారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై కక్షపూరితంగా ఉందన్నారు. జగన్ కు ప్రజాస్వామ్య విలువలు తెలియవన్న గంటా.. ఐదు ఏళ్లలో అసెంబ్లీకి 25 రోజులే హాజరయ్యారని చెప్పారు.
ఏపీకి భద్రశత్రువులుగా ఉన్నవారితో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు గంటా శ్రీనివాసరావు. జగన్ అఫిడవిట్ ను మీడియాకు చూపించిన గంటా.. అఫిడవిట్ లో 25 పేజీలు కేసులవే అన్నారు. జాతీయగీతాన్ని అవమాన పరిచిన కేసు కూడా జగన్ పై ఉందరి చూపించారు గంటా.
