హ్యాట్సాఫ్ ఏపీ పోలీస్: హార్ట్ పేషంట్ కోసం గ్రీన్ ఛానల్.. 12 నిమిషాల్లో 25 కిలోమీటర్లు

హ్యాట్సాఫ్ ఏపీ పోలీస్: హార్ట్ పేషంట్ కోసం గ్రీన్ ఛానల్.. 12 నిమిషాల్లో 25 కిలోమీటర్లు

సాధారణంగా అవయవదానం కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ, మొదటిసారి హార్ట్ పేషంట్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు. మధ్య ప్రదేశ్ కి చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తికి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రావటంతో హార్ట్ సర్జరీ కోసం కాకినాడ నుండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వరకు హెలికాఫ్టర్ లో తరలించి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించటం కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇందుకోసం 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ని మళ్లించి కొద్దీ క్షణాల్లోనే అతన్ని హాస్పిటల్ కి తరలించారు పోలీసులు.

గతంలో పలుమార్లు అవయవ మార్పిడి కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయటం మనం చూశాం. కానీ, హార్ట్ పేషంట్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి. పేషంట్ ని కాపాడే ప్రయత్నంలో చొరవ చూపిన రాజమండ్రి పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది సక్సెస్ అయ్యారు. పేషంట్ కి ప్రాణాపాయం తప్పడంతో అతని కుటుంబ సభ్యులు డాక్టర్లకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవటంతో హ్యాట్సాఫ్ టు ఏపీ పోలీస్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read :చంద్రబాబును అడ్డుకున్న జలీల్ ఖాన్ అనుచరులు