ఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించడమే లక్ష్యం: స్పీకర్ తమ్మినేని

ఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించడమే లక్ష్యం: స్పీకర్ తమ్మినేని

ఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించాలనేదే తన లక్ష్యమని ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ..  దేశంలో స్పీకర్ వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు.  స్పీకర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉందని. మీడియా కూడా క్రియాశాలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందని నాలుగు స్తంబాల్లాంటి వ్యవస్థల కంటే పౌరవ్యవస్థ అనే మరో  శక్తివంతమైన వ్యవస్థ ఉందని, శాసన సభ అద్దం లాంటిదని, ఇక్కడ చెప్పేవే  ప్రజలకు ప్రతిభింబిస్తుందన్నారు.మనందరినీ పౌరవ్యస్థ గమనిస్తుందనే విషయాన్ని మనం గమనించుకోవాలన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉంది  మీడియా  క్రియాశీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు.

తనపై ఎవరి ఒత్తిళ్లు లేకపోవడం వల్లే స్వతంత్ర నిర్ణయాలు  తీసుకుంటున్నానని చెప్పారు.  ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెబుతోందని,  స్పీకర్ కు విచక్షణ అధికారాలు  ఉంటాయని తమ్మినేని చెప్పారు.  ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకపోతేనే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.  శాసన సభలో 3 ఛానళ్లపై నిషేధం విధించడాన్ని తాను సమర్ధించానని చెప్పారు.  శాసన సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ నుంచి లైవ్ లు ఇవ్వకూడదని నిబంధన  ఉందని,  భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే తాత్కాలిక నిషేధం  విధించామని,  ఛానళ్ల యాజమాన్యాలు ఇచ్చిన వివరణ ను  పరిశీలిస్తున్నామని,  వీలైనంత త్వరలో సానుకూల నిర్ణయం   తీసుకుంటామని చెప్పారు.

శాసనసభలో ప్రతిపక్ష తెదేపా గొంతునొక్కే ఉద్దేశం  తనకు లేదన్నారు తమ్మినేని సీతారాం.   చంద్రబాబు సహా తెదేపా నేతలు అలాభావిస్తే ప్రజాభిప్రాయం తీసుకుందామన్నారు. ముగ్గురు తెదేపా  రాజ్యసభ సభ్యులను భాజపా లో చేర్చుకోవడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడినే అడగాలని ఆయన అన్నారు.  రాజ్యసభ లో తెదేపా సభ్యులను చేర్చుకోవడం  తప్పేనని,  రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే అనైతికను ప్రోత్సహించడం  సరికాదని అన్నారు. తానెప్పుడూ ఫిరాయిపులను ప్రోత్సహించనని చెప్పారు.

.