యాదాద్రిలో ఏపీ మంత్రి ఆర్కే రోజా

 యాదాద్రిలో ఏపీ మంత్రి ఆర్కే రోజా
  • ఇప్పుడు స్వామివారి ఆశీస్సులతో ప్రజాసేవకు బయలుదేరుతున్నాను
  • ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా

ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న శత ఘటాభిషేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం తర్వాత మంత్రి రోజాకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. యాదాద్రికి వచ్చిన ఆర్కే రోజా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

శ్రావణమాసం, స్వాతి నక్షత్రం స్వామి వారికి చాలా ఇష్టమైన రోజు అని గుర్తు చేశారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని.. స్వామి వారి ఆశీస్సులతో రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో మమేకం అవుతానని చెప్పారు. గతంలో వచ్చినప్పుడు ఆశీర్వదించి మంత్రిని చేశారని..ఇప్పుడు కూడా స్వామి వారిని సేవించుకుని ప్రజా సేవకు బయలుదేరుతున్నానని రోజా తెలిపారు. లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న సందర్భంగా 108 కలషాలతో అభిషేకం కన్నుల పండుగలా సాగిందని మంత్రి రోజా పేర్కొన్నారు.