
సికింద్రాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా అపర్ణ గర్గ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సివిల్‌సర్వీసెస్1987 బ్యాచ్ కి చెందిన అపర్ణ ఇప్పటివరకు బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీకి ప్రధాన ఆర్థిక సలహాదారుగా, మైసూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వేలలో 35 సంవత్సరాలపాటు వివిధ హోదాల్లో పనిచేశారు.
ఈమె యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ ఎకనామిక్స్‌లో అడ్వాన్స్‌డ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశారు. స్కూల్ ఆఫ్ మేనే జ్‌మెంట్, సింగపూర్, హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శిక్షణ పొందారు.