
హైదరాబాద్, వెలుగు: హెల్త్ ప్రొఫెషనల్స్ కొరతను తీర్చడానికి మహీంద్రా విశ్వవిద్యాలయం అపోలో హెల్త్‌కేర్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా అలైడ్ హెల్త్ సైన్సెస్ బ్యాచిలర్ కోర్సులు అందిస్తారు. వీటిలో అనస్తీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ వంటి స్పెషలైజేషన్లు ఉంటాయి.
సిలబస్‌ను నేషనల్అలైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూపొందిస్తారు. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అపోలో హాస్పిటల్స్ అనుబంధ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లలో క్లినికల్ రొటేషన్లు లభిస్తాయి. చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అపోలో హాస్పిటల్స్, అనుబంధ నెట్‌వర్క్‌ల ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలూ లభిస్తాయి.