కంటోన్మెంట్ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడండి

కంటోన్మెంట్ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడండి

సైఫాబాద్/పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో గల సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ కోరారు. సోమవారం కలెక్టర్ ప్రియాంక ఆలను కలిసి వినతిపత్రం అందించారు. తొకట్టలోని సర్వే నంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని తెలిపారు.

2025లో ఈ భూమిలో 6 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు ప్రతిపాదించారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం సదరు భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.