సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ 'సి' విభాగంలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్‌‌‌‌‌‌‌‌ నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

క్రీడా విభాగాలు: జిమ్నాస్టిక్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్ స్పోర్ట్స్ కయాక్, కానో, రోయింగ్, బాడీబిల్డింగ్, వెయిట్‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రయత్లాన్, డైవింగ్, డైవింగ్ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్.

అర్హత: పదో తరగతి ఉత్తీ్ర్ణత, నిర్దిష్ట శారీరక దారుఢ్యంతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.crpf.gov.in వెబ్​సైట్లో సంప్రదించాలి.