బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆట రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్, మైండ్ గేమ్స్‌కు తోడు అంచనాలకు మించిన ట్విస్టులు, క్షణక్షణానికీ మారుతున్న సమీకరణాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించేస్తోంది. ఈసారి ఆట వేరే లెవెల్అన్నట్లుగానే కంటెస్టెంట్ల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా మొదలైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, అప్పుడే విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్‌కు సిద్ధమైంది. అయితే ఇప్పుడు అందరి చూపూ ఎలిమినేషన్‌పైనే ఉంది
మొదటి వారం చైత్ర ఔట్ అవ్వగా, రెండో వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు. కానీ మూడో వారం ముఖేష్ చేసిన త్యాగంతో ఎలిమినేషన్ గండం తప్పింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ .. కేవలం రెండు రోజులకే రూ. 15 లక్షలు సూట్ కేస్ తీసుకుని హౌస్ నుంచి బయటటి వచ్చి అందరినీ ఆశ్చర్యపూరిచాడు. ఆ ఉత్కంఠ అంతా ఇప్పుడు వడ్డీతో సహా నాలుగో వారంపై పడింది. పైగా గత వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి, ఈ వారం హౌస్‌లో 'డబుల్ ఎలిమినేషన్' ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఓటింగ్‌లో టాప్ కంటెస్టెంట్స్ వీరే..
ఈ వారం ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ బరిలో నిలిచి ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ ఓటింగ్ సరళి చూస్తుంటే.. స్టార్ కంటెస్టెంట్ త్రిగుణ్ తనకంటూ భారీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఓటింగ్స్‌లో కింగ్‌లా టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. ఇక రోహిత్ కూడా ఏమాత్రం తగ్గకుండా రెండో స్థానంలో నిలిచాడు. తన జెన్యూన్ మాట తీరుతో ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ముఖేష్ గౌడ రోజురోజుకూ పుంజుకుంటూ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకడం విశేషం. ఆ తర్వాత నరేష్, అమన్ మసూద్, షాలిని, దేబ్జానీలు వరుస స్థానాల్లో సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు..
అసలు టెన్షన్ అంతా బాటమ్ ప్లేస్‌లో ఉన్న ఆ ఇద్దరి గురించే. ప్రస్తుతం చరణ్, సృష్టి ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా సృష్టి పరిస్థితి దారుణంగా ఉంది. హౌస్‌లో సుధీర్‌తో ఆమె ప్రవర్తించిన తీరుపై బయట నెగెటివ్ ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. తన గేమ్‌ను మెరుగుపరుచుకోలేకపోవడంతో ఈ వారం ఆమె ఎలిమినేషన్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన బ్రహ్మాండమైన లైఫ్ లైన్‌ను చరణ్ ఏమాత్రం వాడుకోలేకపోతున్నాడు. పైగా కంటెస్టెంట్ ఝాన్సీపై అతను చేసిన అభ్యంతరకర కామెంట్స్ అతనికి తీవ్ర మైనస్‌గా మారాయి. డబుల్ ఎలిమినేషన్ గనక జరిగితే.. సృష్టితో పాటు చరణ్ కూడా పెవిలియన్ చేరడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.
అయితే, లాస్ట్ మినిట్ ట్విస్టులు ఇవ్వడంలో బిగ్ బాస్ తర్వాతే ఎవరైనా అన్నట్లు ఆట సాగుతోంది. ట్రెండ్స్ ఎలా ఉన్నా, వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వేదికపైకి వచ్చి అధికారికంగా ప్రకటించే వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎవరెవరికి కింగ్ క్లాస్ పీకనున్నారో ఉత్కంఠగా మారింది.
