కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు దరఖాస్తుల వెల్లువ

కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు దరఖాస్తుల వెల్లువ

తెలంగాణలో కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంసెట్ నుంచి లాసెట్ దాకా అన్నింటికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అత్యధికంగా ఎంసెట్ కు ఇప్పటిదాకా  2,61,616 మంది అప్లై చేసుకోగా..  ఐసెట్ కు 30,941, ఈసెట్ కు 22,549 మంది,  లాసెట్ కు 24,242 మంది, ఎడ్ సెట్ కు 16,437 మంది, పీజీ సెట్ కు 4,462 మంది, పీఈ సెట్ కు 1,128  దరఖాస్తు చేశారు. ఎంసెట్ కు  రూ.500 ఫైన్ తో 17.06.2022 తేదీ వరకు గడువు ఉంది. జూలై 14,15, 18, 20  తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసెట్ కు రూ. 500 ఫైన్ తో 14.06.2022 తేదీ వరకు గడువు ఉంది.  జూలై 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ కు ఫైన్ తో కాకుండా 27.06.2022  తేదీ వరకు గడువు ఉంది. జూలై 27, 28 తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు. పీజీ సెట్ కు ఫైన్ తో కాకుండా 22.06.2022  తేదీ వరకు గడువు ఉంది. జూలై 29, ఆగస్టు 01 న పరీక్ష నిర్వహించనున్నారు. లాసెట్ కు  ఫైన్ తో కాకుండా 16.06.2022  తేదీ వరకు గడువు ఉంది. జూలై 21, 22 తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఎడ్ సెట్ కు ఫైన్ తో కాకుండా 15.06.2022  తేదీ వరకు గడువు ఉంది.  జూలై 26, 27తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు. పీఈ సెట్ కు ఫైన్ తో కాకుండా 18.06.2022  తేదీ వరకు గడువు ఉంది. ఆగస్టు 22 తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.