ఓవర్సీస్ స్కాలర్ షిప్ లకు అప్లై చేస్కోండి : బీసీ వెల్ఫేర్ కమి షనర్ బాల మాయాదేవి

ఓవర్సీస్ స్కాలర్ షిప్ లకు అప్లై చేస్కోండి : బీసీ వెల్ఫేర్ కమి షనర్ బాల మాయాదేవి
  •     రేపటి నుంచి వచ్చే నెల 24 వరకు దరఖాస్తుకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతీబా పూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్ కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయాదేవి వెల్లడించారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 24 వరకు అప్లికేషన్లకు గడువు ఉంటుందని తెలిపారు. గత ఏడాది వరకు ఏటా 300 మందికి అవకాశం ఉండగా ఈ ఏడాది ఈ సంఖ్యను ప్రభుత్వం 700కు పెంచిందని పేర్కొన్నారు. ఇందులో బీసీల్లో 500  మందికి, ఈబీసీల్లో 200 మందికి అవకాశం ఇస్తున్నామన్నారు. 

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండి, డిగ్రీలో 60% మార్కులు ఉండి, 35 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులని కమిషనర్ తెలిపారు. జీఆర్ఈలో 260 మార్కులు లేదా జీమ్యాట్ లో 500 మార్కులు ఉండాలన్నారు. టోఫెల్ లో 60 మార్కులు లేదా ఐఈఎల్టీఎస్ లో60 మార్కులు, పీటీఈలో 50 మార్కులు.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉన్నాచాలన్నారు. వివరాలకు http//www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.