ఇంటి నుంచే పాన్‌కార్డు అప్లై చెయ్యొచ్చు

ఇంటి నుంచే పాన్‌కార్డు అప్లై చెయ్యొచ్చు

పాన్‌కార్డు తీసుకునే వారు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. చాలా సులువుగా ఇంటి నుంచే దీన్ని అప్లై చేసుకునే అవకాశాన్ని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కల్పించబోతోంది. ఆధార్ కార్డు డేటా ఎంటర్ చేస్తే చాలు పాన్ రెడీ అయిపోతుంది. త్వరలోనే ఈ సులభతర విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో పాటు గతంలో కంటే త్వరగా పాన్‌కార్డు అందించనున్నారు.

పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగా పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ డేటా ఎంటర్ చేసి OTPని పొందాలి. ఆ తర్వాత అందులో అడ్రస్ తో పాటు తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇస్తే సరిపోతుంది. వెంటనే పాన్‌కార్డు జనరేట్ అవుతుంది. తర్వాత ఒకసారి డిజిటల్ సంతకం చేస్తే ఇక పాన్‌కార్డు రోజుల వ్యవధిలోనే ఇంటికి వచ్చేస్తుంది. త్వరలోనే ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. దీంతో పాటు డేటా ఫోర్జరీ కాకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలను తీసుకోనుంది ఐటీశాఖ.