
హైదరాబాద్, వెలుగు: మరో ఐదు కార్పొరేషన్లకు రాష్ట్ర సర్కారు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర విమెన్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నగేశ్; గొర్రెలు, మేకల డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా ఓయూ స్టూడెంట్ లీడర్ దూదిమెట్ల బాలరాజు, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమెటెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా టీఆర్ఎస్ నాయకుడు పాటిమీద జగన్మోహన్రావును నియమించారు. వీరు రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. రెండు రోజుల క్రితం 3 కార్పొరేషన్లకు, తాజాగా 5 కలిపి మొత్తం 8 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. 8 మంది చైర్మన్లలో ఒకరు ఓసీ, ముగ్గురు బీసీ, నలుగురు ఎస్సీలకు చాన్స్ ఇచ్చారు.