ఆస్పత్రుల స్థితిగతులపై సబ్ కమిటీ నియామకం

 ఆస్పత్రుల స్థితిగతులపై సబ్ కమిటీ నియామకం
  • కేరళ,తమిళనాడుతోపాటు, శ్రీలంక వెళ్లి అధ్యయనం చేసి రావాలని ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం, సిబ్బంది నియామకంతోపాటు ఇతర మౌళిక సౌకర్యాలను సమీక్షించేందుకు  సబ్ కమిటీని నియమించాలని  కేబినెట్ నిర్ణయించింది. ఈ  వైద్య ఆరోగ్య సబ్ కేబినెట్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.
వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న  పొరుగు దేశమైన శ్రీలంక కు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని, సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.