టెహ్రాన్: హార్మూజ్ జలసంధి సాధారణ, వాణిజ్య నౌకల రాకపోకల కోసం తెరిచే ఉందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) స్పష్టం చేసింది. అయితే, సైనిక నౌకలు హార్మూజ్ సమీపంలోకి వస్తే దాడులు తప్పవని హెచ్చరించింది. జలసంధి మొత్తం తమ నియంత్రణలోనే ఉందని తేల్చిచెప్పింది.
ఈమేరకు హార్మూజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఐఆర్ జీసీ స్పందించింది. హార్మూజ్ సమీపంలోకి వస్తే సుడిగుండాల్లో మునిగిపోతారని అమెరికన్ నేవీని హెచ్చరించింది. అంతకుముందు, తమ నౌకలు రెండు హార్మూజ్ జలసంధిని దాటాయన్న అమెరికా వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. సైనిక నౌకలు ఆ జలమార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తే ‘తీవ్రమైన ప్రతిస్పందన’ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
