టూవీలర్ల తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తమ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ సిరీస్ స్కూటర్లను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. తెలంగాణలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ 125 సీసీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,10,374 కాగా, 175 సీసీ మోడల్ ధర రూ.1,30,374గా నిర్ణయించారు.
ఈ–20 పెట్రోల్‌కు అనుకూలమైన ఈ స్కూటర్లలో 14 అంగుళాల పెద్ద చక్రాలు, ట్రైపాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు అమర్చారు. 175 సీసీ వేరియంట్‌లో బ్లూటూత్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ముందు చక్రానికి ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
