హైదరాబాద్, వెలుగు: ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్. శ్రీనివాస్ శుక్రవారం ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం ఆయన ఏసీబీ డీజీ రవిగుప్తను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస్ ఇప్పటిదాగా సిటీ కమిషనరేట్ పరిధిలో అడిషనల్ సీపీగా పనిచేశారు.క్రైమ్, షీ టీమ్స్ ఇన్ ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. టీఎస్పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో ఏర్పాటు చేసిన సిట్ చీఫ్‌గా కూడా పనిచేశారు. కీలక కేసులను ఛేదించడంలో సిబ్బందికి గైడ్ చేశారు.

