కారు సీట్లు, కార్పెట్లు, ఫ్లోర్ మ్యాట్స్‌పై పేరుకుపోయిన పెంపుడు జంతువుల వెంట్రుకలను తొలగించడానికి ఈ క్లీనర్ ఉపయోగపడుతుంది. ఈ విభాగంలో పెట్‌వోగ్, కుర్గో షెడ్ స్వీపర్ వంటి బ్రాండ్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణంగా హై క్వాలిటీ ఏబీఎస్ ప్లాస్టిక్, సిలికాన్ లేదా రబ్బర్ బ్రిసిల్స్‌తో తయారవుతాయి.
సిలికాన్ లేదా రబ్బర్ బ్లేడ్లు కార్పెట్లు, ఫ్యాబ్రిక్ ఉపరితలాలపై ఉన్న వెంట్రుకలను తొలగించడంలో సాయపడతాయి. ఈ క్లీనర్లతో కారు సీట్లు, ఫ్లోర్ మ్యాట్స్, బూట్ స్పేస్‌ను క్లీన్ చేయొచ్చు. అలాగే సోఫాలు, దుప్పట్లు, కుషన్లపై పేరుకుపోయిన వెంట్రుకలను తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి.
ధర : బ్రాండ్‌ని బట్టి రూ.250 నుంచి రూ.3,000లకుపైగా.
