మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’(Patriot). మహేష్ నారాయణన్ దర్శకుడు. మే1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఎంగేజ్ చేస్తుంది. ప్రముఖ జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
నేషనల్ సెక్యూరిటీ, ప్రభుత్వ నిఘా వ్యవస్థ నేపథ్యంలో మహేష్ నారాయణన్ తెరకెక్కించారు. డీఆర్‌డీవో ఆఫీసర్‌గా మమ్ముట్టి నటించగా, తనపై పడిన దేశద్రోహి అనే ముద్రను చెరిపేసేందుకు సహాయపడే స్నేహితుడిగా మోహన్‌లాల్, లాయర్ పాత్రలో నయనతార నటించారు. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, కుంచాకో బోబన్, రేవతి కీలకపాత్రలు పోషించారు.
గూఢచర్యం, డిజిటల్ నిఘా నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. పేద విద్యార్థులకు పంపిణీ చేసే ల్యాప్‌టాప్‌లలో 'పెరిస్కోప్' అనే స్పైవేర్ ఉందని పోరాడే పాత్రలో మమ్ముట్టి రోల్ సినిమాకి బలాన్ని ఇచ్చింది. దర్శకుడు మహేష్ నారాయణన్ ఎంచుకున్న పాయింట్ చాలా సీరియస్ అండ్ కంటెంపరరీ. డిజిటల్ నిఘా ఎంత ప్రమాదకరమో ఆయన చక్కగా చూపించారు.
Once the suspense begins… there’s no looking away.
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 8, 2026
This weekend’s most watched film
Watch the thriller everyone is hooked on, now streaming on Zee5 Telugu #Patriot #TeluguZee5 #Mammootty #MohanLal #PatroitOnZee5 pic.twitter.com/PHIBOgxxqb
కథేంటంటే:
డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) డీఆర్డబ్ల్యూ అనే డిఫెన్స్ సంస్థలో సైంటిస్ట్గా పనిచేస్తుంటాడు. స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ టాప్ల పనితీరుపై ఆయనకి మంచి అవగాహన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకి ఫ్రీగా ల్యాప్ టాప్‌లు అందజేస్తారు. అవి మినిస్టర్ సుందరానికి సంబంధించిన శక్తి గ్రూప్ తయారుచేస్తుంది. వాటిలో రహస్యంగా అమర్చిన కెమెరాలు అవి వాడేవాళ్ల సమాచారాన్ని బయటికి పంపుతుంటాయి.
ఈ నెట్వర్క్ వెనుక ఎవరు ఉన్నారనేది కనిపెట్టడానికి డేనియల్ రంగంలోకి దిగుతాడు. అయితే అప్పటికే అందుకు సంబంధించిన ఆధారాలు జ్యోతి (దర్శన రాజేంద్రన్) చేతికి చిక్కుతాయి. శక్తి గ్రూప్‌కి చెందిన సుందరం ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తాడు. శక్తి గ్రూప్‌ను చట్టానికి పట్టించాలనుకున్న డేనియల్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో సినిమాలో చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి. ఒక నిస్సహాయుడైన శాస్త్రవేత్తగా, అదే సమయంలో వ్యవస్థపై పోరాడే వీరుడిగా ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా మొదటి సగంలో తన అనుభవంతో సినిమాను భుజాలపై మోశారు. సెకండ్ ఆఫ్ లో ఎంట్రీ ఇచ్చే కల్నల్ రహీమ్ పాత్రలో మోహన్‌లాల్ తనదైన శైలిలో మెప్పించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మమ్ముట్టితో కలిసి ఉన్న సీన్స్ ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ అని చెప్పాలి.
ప్రతినాయకుడిగా ఫహద్ నటన సెటిల్డ్‌గా ఉన్నప్పటికీ, ఆయన పాత్రకు బలమైన ఆర్క్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇక నయనతార పాత్ర పరిమితమే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. కుంచాకో బోబన్ తన రేంజ్‌ను దాటి ప్రయోగాత్మక పాత్రలో రాణించారు.
