
కంప్యూటర్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్లు మౌస్‌ని చాలా వేగంగా కదిలిస్తుంటారు. కానీ.. మామూలు మౌస్ ప్యాడ్ మీద అది సాధ్యం కాదు. అందుకే అలాంటివాళ్లు ఇలాంటి గేమింగ్ మౌస్‌ప్యాడ్‌ని వాడాలి. దీన్ని ఆర్చర్ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీని మీద మౌస్‌ని చాలా వేగంగా కదిలించవచ్చు. సాఫ్ట్‌నెస్ కోసం దీన్ని జాక్వర్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. దీని చుట్టూ 16 ఆర్జీబీ లైట్లు ఉంటాయి. ఒకే టచ్‌తో వాటిని ఆన్/ఆఫ్ చేయొచ్చు. పైగా ఇది వాటర్ రెసిస్టెంట్‌తో రావడం వల్ల ప్రమాదవశాత్తు కూల్‌డ్రింగ్, నీళ్లు, కాఫీ లాంటివి పడినా పాడవ్వదు. దీనికి కీబోర్డ్, మౌస్, పెన్‌డ్రైవ్ లాంటివి కనెక్ట్ చేసుకోవడానికి యూఎస్‌బీ, టైప్ సీ పోర్ట్‌లు కూడా ఉంటాయి. దీని ధర రూ.799.