
షాంఘై: ఇండియా యంగ్ ఆర్చర్లు ప్రథమేశ్ జావ్కర్, అవ్నీత్ కౌర్.. వరల్డ్ కప్ స్టేజ్–2లో అదరగొట్టారు. ఇండివిడ్యువల్ కాంపౌండ్ కేటగిరీలో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మెన్స్ కాంపౌండ్ క్వార్టర్‌ఫైనల్లో 19 ఏళ్ల ప్రథమేశ్ 149–148తో చోయ్ యాంగీ (కొరియా)పై నెగ్గాడు. విమెన్స్ క్వార్టర్స్‌లో 18 ఏళ్ల అవ్నీత్ 147–144తో డాఫ్నే క్వింటెరో (మెక్సికో)ను చిత్తు చేసింది.
అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అవ్నీత్ 142–142 (10*–10)తో టాప్‌సీడ్ ఒహ్ యుహున్ (కొరియా)పై గెలిచింది. సెమీస్‌లో గెలిస్తే కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్ మెడల్స్‌ను సొంతం చేసుకుంటారు. మెన్స్ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో ఇండియాకు చుక్కెదురైంది. ధీరజ్ బొమ్మదేవర–అటాన్ దాస్–నీరజ్ చౌహాన్‌తో కూడిన ఇండియా త్రయం క్వార్టర్స్‌లో 0–6 (54–55, 56–57, 54–59)తో టాప్ సీడ్ కొరియా త్రయం లీ వూ సియోక్–కిమ్ జీ డియోక్–కిమ్ వూజిన్ చేతిలో ఓడారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఇండియా 5–3తో చైనీస్ తైపీ చేతిలో నెగ్గింది. విమెన్స్ ఫస్ట్ రౌండ్‌లో సిమ్రన్‌జిత్ కౌర్–అవ్నీత్ కౌర్–అంకితా భాకట్ 1–5 (54–57, 57–57, 50–52)తో ఇండోనేసియా చేతిలో కంగుతిన్నది.