Health tips: టాటూలు వేయించుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Health tips: టాటూలు  వేయించుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

టాటూలు వేయించుకోవడం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది. అయితే, ఇవి వేయించుకుని మురిసిపోతే సరిపోదు. టాటూ వేసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకో వాలి. అలాగే వేయించుకున్న టాటూ అందంగా కనిపించాలంటే కొన్ని జా గ్రత్తలు పాటించాలి. 

  • అవేంటంటే...యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో టాటూ వేయించుకున్న ప్రదేశం శుభ్రం చేసుకోవాలి.
  • తర్వాత యాంటీ సెప్టిక్ ఆయింట్​మెంట్ రాసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయాలి.
  • నాలుగో రోజు నుంచి మాయిశ్చరై జర్ వాడడం మొదలు పెట్టాలి..
  • మూడు వారాల పాటు రోజులో వీలైనన్నిసార్లు మాయిశ్చరైజర్ రాస్తుండాలి.
  • టాటూ నానేలా నీళ్లలో తడవకూడదు... టాటూకు ఎక్కువసేపు ఎండ కూడా తగలకూడదు.
  • టాటూ పాడవకుండా సన్ స్క్రీన్ వాడాలి.
  • టాటూ వేశాక పచ్చిదనం పోయే ముందు దురద ఉంటుంది. అప్పుడు దాన్ని గోకడం, గిల్లడం వంటివి చేయకూడదు.

చాలామంది ఉత్సాహంతో వేయించుకుంటారు. కానీ ఆ తర్వాత నచ్చలేదని. ఇలా కాకుండా వేరేలా వేస్తే బాగుండని తెగ బాధపడుతుంటారు. మళ్లీ దాన్ని తీయించుకునేందుకు. కెమికల్ ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు పరిగెత్తుతారు. టాటూ వేయించుకునే, తీయించుకునే క్రమంలో ఎంతో కొంత రసాయనాలను శరీరం మీదకు, లోపలికి చేరుస్తున్నట్టే. అందుకని ఒకటికి రెండుసార్లు ఆలో చించుకున్నాక టాటూ వేయించుకోవడం బెటర్.