
ఫిఫా వరల్డ్ కప్ 2022లో మెస్సీ సేన మెస్మరైజ్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఖతర్నాక్ ఫర్ఫామెన్స్తో సెమీస్‌కు దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పెనాల్టీ షూటౌట్లో 4–3 స్కోరు తేడాతో విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో రెండు గోల్స్ చేసి సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయం అనివార్యమైంది. అటు ఎక్స్ ట్రా టైంలోనూ రెండు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్ లో నెదర్లాండ్స్ మూడు గోల్స్ సాధించగా...అర్జెంటీనా నాలుగు గోల్స్ కొట్టి విజయం సాధించింది.
హోరా హోరీ..
ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జోరు కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో పటిష్ట నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి రెండు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయితే 35వ నిమిషంలో అర్జెంటీనా తొలి గోల్ కొట్టింది. ఆ తర్వాత 73వ నిమిషంలో మెస్సీ మరో గోల్ సాధించి అర్జెంటీనాకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఈ సమయంలో అర్జెంటీనా గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ మరి కొద్ది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా..నెదర్లాండ్స్ మ్యాజిక్ చేసింది. నెదర్లాండ్స్ ప్లేయర్ వౌట్ వెఘోర్స్ట్ 83 వ నిమిషం, 101 నిమిషంలో గోల్స్ చేసి.. స్కోరును సమం చేశాడు. దీంత అదనపు సమయం అనివార్యమైంది.
నెదర్లాండ్స్ షూటౌట్..
ఎక్స్ట్రా సమయంలోనూ నెదర్లాండ్స్, అర్జెంటీనా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఇక పెనాల్టీ షూటౌట్ హాట్ హాట్‌గా సాగింది. అయితే మెస్సీ అద్భుతంగా గోల్ కొట్టడంతో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ ప్రయత్నాన్ని ఎమిలియానో అడ్డుకున్నాడు. కొద్దిసేపటికే అర్జెంటీనా మరో గోల్ చేసింది. మూడో ప్రయత్నంలో నెదర్లాండ్స్ గోల్ చేయడంతో..స్కోరు 2–1కు తగ్గింది. అర్జెంటీనా మూడో ప్రయత్నంలోనూ గోల్ చేసి ఆధిక్యాన్ని 3–1కు పెంచుకుంది. నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ వెఘోర్స్ట్ మరో గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 3-2కి తగ్గించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఆఖర్లో డి జాంగ్ గోల్ చేయడంతో 4–3 తో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.