వరల్డ్​కప్​ ఫైనల్లో అర్జెంటీనా

 వరల్డ్​కప్​ ఫైనల్లో అర్జెంటీనా
  • సెమీస్​లో క్రొయేషియాపై అద్భుత విజయం 
  • అల్వారెజ్​ డబుల్​ గోల్​

దోహా: సాకర్​ హీరో లియోనల్​ మెస్సీ మరోసారి మ్యాజిక్​ చేయడంతో... అర్జెంటీనా ఆరోసారి ఫిఫా వరల్డ్​కప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0తో క్రొయేషియాను చిత్తు చేసింది. దీంతో 2014 తర్వాత మరోసారి టైటిల్​ ఫైట్​కు అర్హత సాధించింది. అర్జెంటీనా తరఫున ‘మిస్టర్​ 10’ మెస్సీ (34వ ని.) పెనాల్టీ కిక్​ను గోల్​గా మలచగా, జూలియన్​ అల్వారెజ్​ (39, 69వ ని.) డబుల్​ గోల్​ సాధించాడు. 1930, 1978, 1986, 1990, 2014లో ఫైనల్స్​కు అర్హత సాధించిన అర్జెంటీనా.. 1978, 1986లో మాత్రం టైటిల్​ను గెలిచింది. 

మెస్సీ దూకుడు..

ఆరంభంలో ఇరుజట్లు ఎదురుదాడులకు దిగినా.. తొలి హాఫ్​ మొత్తం అర్జెంటీనాదే ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా కెరీర్​లో చివరి వరల్డ్​కప్​ ఆడుతున్న మెస్సీ గోల్స్​ చేసే అవకాశాలను ఎక్కువగా క్రియేట్​ చేశాడు. ఫలితంగా 2018 ఫైనలిస్ట్​ క్రొయేషియాకు ఏ దశలోనూ పుంజుకునే చాన్స్​ ఇవ్వలేదు. చివరకు 34వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్​ను మెస్సీ సూపర్‌‌గా గోల్​పోస్ట్​లోకి పంపాడు. ఐదు నిమిషాల తర్వాత అల్వారెజ్​ సోలో గోల్​తో అర్జెంటీనా లీడ్​ను 2–0కు పెంచాడు. ఇక్కడి నుంచి స్కోరును సమం చేసేందుకు క్రొయేషియా ఎన్ని ప్రయత్నాలు చేసినా అర్జెంటీనా డిఫెన్స్​ ముందు ఫలించలేదు. సెకండ్​ హాఫ్​లోనూ మెస్సీసేన ఎక్కడా పట్టు కోల్పోలేదు. 69వ నిమిషంలో మెస్సీ మళ్లీ గోల్​ చేసే చాన్స్​ను క్రియేట్​ చేశాడు.  లెఫ్ట్​ ఫ్లాంక్​ నుంచి బాల్​ను డ్రిబ్లింగ్​ చేసుకుంటూ వచ్చి అల్వారెజ్​కు పాస్​ ఇచ్చాడు. అంతే క్షణాల్లో అతను దాన్ని గోల్​గా మలచి లీడ్​ను 3–0కు పెంచాడు. అప్పటికే డీలా పడిన క్రొయేషియన్లు డిఫెన్స్‌‌లో పట్టు కోల్పోయారు. 

ఫైనల్‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌తో నా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ప్రయాణాన్ని ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు సాధించిన ఘనతలతో చాలా హ్యాపీగా ఉన్నా. కప్‌‌‌‌ కోసం మరో ఏడాది అంటూ ముందుకెళ్తున్నా. ఈసారి సాధిస్తానో  లేదో కూడా తెలియదు. అయినప్పటికీ ఇలాంటి ఫినిషింగ్‌‌‌‌ లభిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రికార్డుల పరంగా అంతా బాగున్నాయి. కానీ ఓ గ్రూప్‌‌‌‌గా మేం అనుకున్న లక్ష్యాన్ని చేరితే అద్భుతంగా ఉంటుంది. 

‑ మెస్సీ

రికార్డులే.. రికార్డులు

  • ఈ వరల్డ్​కప్‌‌‌‌‌‌‌‌‌‌లో మెస్సీకి ఇది ఐదో గోల్​ కాగా, మెగా ఈవెంట్​లో ఓవరాల్​గా 11వ గోల్ (25 మ్యాచ్​లు)​ కావడం విశేషం. దీంతో అర్జెంటీనా తరఫున వరల్డ్​కప్​లో అత్యధిక గో ల్స్​ సాధించిన తొలి ప్లేయర్​గా మెస్సీ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో గాబ్రియెల్​ బటిస్టుటా (12 మ్యాచ్​ల్లో 10 గోల్స్​)ను అధిగమించాడు. గిల్మెరో స్టబిలే (4 మ్యాచ్​ల్లో 8 గోల్స్), డిగో మారడోనా (21 మ్యాచ్​ల్లో 8 గోల్స్​), మారియో కెంప్స్​ (18 మ్యాచ్​ల్లో 8 గోల్స్​) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
  • వరల్డ్‌‌‌‌కప్స్‌‌‌‌లో 11 గోల్స్‌‌‌‌ చేసిన మూడో ప్లేయర్‌‌‌‌గా సాండోర్‌‌‌‌ కోసిస్‌‌‌‌ (హంగేరి), జుర్గెన్‌‌‌‌ క్లిన్‌‌‌‌స్మాన్‌‌‌‌ (జర్మనీ)తో సమంగా నిలిచాడు. 
  • ఒక వరల్డ్​కప్​లో ఐదు గోల్స్​ సాధించిన అత్యధిక వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) మరో ఘనత సాధించాడు. 
  • వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో 25 మ్యాచ్‌‌‌‌లు ఆడిన మెస్సీ.. లోథర్‌‌‌‌ మథియాస్‌‌‌‌ (జర్మనీ)తో సమంగా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బరిలోకి దిగితే అత్యధిక మ్యాచ్‌‌‌‌లు ఆడిన రికార్డు సొంతమవుతుంది. 
  • నాలుగు వరల్డ్​కప్స్​లో గోల్స్​ చేయడంతో పాటు గోల్స్​కు సహకరించిన ఏకైక ప్లేయర్​గా మెస్సీ మరో రికార్డు సాధించాడు (2006లో ఒకసారి, 2022లో మూడుసార్లు). 
  • అర్జెంటీనా తరఫున కెప్టెన్‌‌గా అత్యధిక మ్యాచ్‌‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌‌ మెస్సీ (18). నాకౌట్‌‌ మ్యాచ్‌‌ల్లో అత్యధిక గోల్స్‌‌కు సహకరించిన ప్లేయర్‌‌గా పీలే (6)తో సమంగా నిలిచాడు.
  • ఒక వరల్డ్​కప్​లో నాలుగుసార్లు ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​’గా నిలవడం మెస్సీకి ఇది రెండోసారి. 2014లోనూ ఈ ఘనత సాధించాడు. ఆడిన ఐదు ప్రపంచకప్స్​లో 10సార్లు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కించుకున్న తొలి ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. క్రిస్టియానో రొనాల్డో (7), రోబెన్​ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
  • వరల్డ్​కప్​లో అత్యధిక విజయాలు సాధించిన మిరోస్లోవ్​ క్లోస్​ (17) రికార్డుకు మెస్సీ (16) అడుగు దూరంలో ఉన్నాడు.  ప్రపంచకప్​లో మూడు నాకౌట్​ మ్యాచ్​ల్లో గోల్స్​ చేసిన ఏకైక అర్జెంటీనా ప్లేయర్​ మెస్సీ.