నాలుగో రౌండ్‌‌‌‌లో అర్జున్‌‌‌‌

నాలుగో రౌండ్‌‌‌‌లో అర్జున్‌‌‌‌

పంజిమ్‌‌‌‌: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. వరల్డ్‌‌‌‌ చెస్‌‌‌‌ కప్‌‌‌‌లో నాలుగో రౌండ్‌‌‌‌లోకి ప్రవేశించాడు. అర్జున్‌‌‌‌.. షంసిద్దీన్ వోఖిడోవ్ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌) మధ్య శనివారం జరిగిన మూడో రౌండ్‌‌‌‌ రెండో గేమ్‌‌‌‌ 51 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో తెలంగాణ ప్లేయర్‌‌‌‌ 1.5–0.5తో ముందంజ వేశాడు. నల్ల పావులతో ఆడిన అర్జున్‌‌‌‌ కీలక టైమ్‌‌‌‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేయలేకపోయాడు. దాంతో షంసిద్ధిన్‌‌‌‌ చకచకా ఎత్తులు వేసి గేమ్‌‌‌‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. 

తెలుగు గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ పెంటేల హరికృష్ణ 1.5–0.5 తేడాతో డానియెల్‌‌‌‌ డార్డా (బెల్జియం)పై నెగ్గాడు. రాబర్ట్ హోవానిస్యన్ (ఆర్మేనియా)తో జరిగిన గేమ్‌‌‌‌లో ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద 42 ఎత్తుల వద్ద విజయం సాధించాడు. ఫలితంగా 1.5–0.5 తేడాతో నాలుగో రౌండ్‌‌‌‌లోకి అడుగుపెట్టాడు.  టైటాస్ స్ట్రెమావిసియస్ (లిథువేనియా)తో జరిగిన గేమ్‌‌‌‌లో గెలిచిన వి. ప్రణవ్‌‌‌‌ 1.5–0.5 తేడాతో ముందుకెళ్లాడు. ఫెడెరిక్‌‌‌‌ స్వానే (జర్మనీ)తో జరిగిన గేమ్‌‌‌‌లో గుకేశ్‌‌‌‌ 0.5–1.5 తేడాతో ఓటమిపాలయ్యాడు. గాబ్రియెల్‌‌‌‌ సర్గిసియాన్‌‌‌‌ (ఆర్మేనియా)తో జరిగిన గేమ్‌‌‌‌లో ఓడిన దీప్తయాన్‌‌‌‌ ఘోష్‌‌‌‌కు కూడా నిరాశే ఎదురైంది.