న్యూఢిల్లీ: ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్లు నాలుగో రౌండ్‌లో డ్రాతో సరిపెట్టుకున్నారు. పీటర్ లెకో (హంగేరి)తో జరిగిన గేమ్‌ను తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ 20 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. నల్ల పావులతో ఆడిన అర్జున్ ఆరంభంలో వ్యూహాత్మకంగా ఆడినా.. పీటర్ దీటుగా నిలువరించాడు.
ఇక ఆర్. ప్రజ్ఞానంద.. డానిల్ డుబోవ్ (ఫిడే) మధ్య జరిగిన గేమ్ కూడా 41 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. వి. ప్రణవ్ .. నొడిర్బెక్ యాకుబోయెవ్ (రష్యా), పెంటేల హరికృష్ణ.. నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), కార్తీక్.. క్వాంగ్ లియామ్ (వియత్నాం) మధ్య జరిగిన గేమ్‌లు వరుసగా 82, 32, 37 ఎత్తుల వద్ద డ్రాగా ముగిశాయి.
