ధాన్యం కాంటా వేయట్లేదని సొసైటీ ఆఫీసుకు తాళం.. ఆర్మూర్లో రైతుల నిరసన

ధాన్యం కాంటా వేయట్లేదని సొసైటీ ఆఫీసుకు తాళం.. ఆర్మూర్లో రైతుల నిరసన

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనానికి సోమవారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామం నుంచి ధాన్యం కాంటా వేయడం లేదని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా ధాన్యం కోసి కళ్లాల్లో ఉంచామని వాపోయారు.

సొసైటీ నిర్వాహకులు లారీ యజమానులతో కుమ్మక్కై తమ గ్రామానికి లారీలను పంపడం లేదని, ఇతర గ్రామాలకు రోజూ ఒకట్రెండు లారీలను మాత్రమే పంపుతూ ధాన్యం సేకరిస్తున్నారని ఆరోపించారు. రాంపూర్‌‌పై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. లారీలను పంపి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాకు మెమోరాండం అందజేశారు.