వేట మొదలైంది.. మరో చోట ఆర్మీ కార్డన్ సెర్చ్

వేట మొదలైంది.. మరో చోట ఆర్మీ కార్డన్ సెర్చ్

భారత ఆర్మీ వేట మొదలుపెట్టింది. పాక్ ముష్కరుల ఏరివేతకు కసితో బరిలో దిగింది. పుల్వామా దాడి తర్వాత రగులుతున్న గుండెలతో ఉగ్రవాదుల ఊచకోతకు దూకింది. అక్రమంగా సరిహద్దు దాటి ఇండియా గడ్డపై అడుగుపెట్టిన ఏ ఒక్క టెర్రరిస్టునూ వదలకుండా మట్టుబెట్టేందుకు ఉరకలేస్తున్నారు వీర జవాన్లు.

ఈ రోజు ఉదయమే పాక్ ముష్కర మూకలపై ఆర్మీ తొలి పంజా పడింది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ ను వెనుకనుండి నడిపించినోడిని మట్టుబెట్టారు. పుల్వామా జిల్లాలోనే ఆ దాడి మాస్టర్ మైండ్ రషీద్ ఘాజీ నక్కి ఉన్నాడన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ షురూ చేశాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. దాదాపు 10 గంటల ఆపరేషన్లో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు మన సైనికులు. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు జవాన్లు అమరులవడం దేశాన్ని బాధిస్తోంది.

ఓ ప్రాంతంలో దాగిన ముష్కరులను మట్టుబెట్టారో లేదో.. అంతలోనే మరో ప్రాతంలో వేటకు దిగారు. సోఫియన్ జిల్లా క్రవోరా గ్రామంలో కార్డన్ సెర్చ్ మొదలు పెట్టారు వీర జవాన్లు. సరిహద్దు దాటి అక్రమంగా చొరబడిన ఏ ఒక్కడిని వదలొద్దన లక్ష్యంతో రంగంలోకి దిగారు. పాక్ లోని ఉగ్ర సంస్థలు ఆడించినట్లు ఆడే ప్రతివాడినీ అంతమొందించే పనిలో పడ్డారు.