ఆకట్టుకున్న ‘దక్షిణ శక్తి’ విన్యాసాలు

ఆకట్టుకున్న ‘దక్షిణ శక్తి’ విన్యాసాలు

జైసల్మేర్: దక్షిణ్ శక్తి ఎక్సర్ సైజ్-2021లో భాగంగా భారత ఆర్మీ సదరన్ కమాండ్ యుద్ధ విన్యాసాలు చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు కొనసాగాయి. ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన దాదాపు 30 వేల మంది సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. తొలిసారి స్పేస్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సును ఇందులో చేర్చారు. టీ-90  ట్యాంకులు, టీ-72 ట్యాంకులు, క్షిపణులు,ఆర్సీఎల్ తుపాకులను కార్యక్రమంలో ప్రదర్శించారు.