అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అప్పర్‌ సియాంగ్ జిల్లాలోని టూటింగ్‌ హెడ్‌క్వార్టర్స్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగింగ్ గ్రామంలో  ఉదయం 10.43గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్‌ క్రాష్ అయిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేదని, ప్రస్తుతం ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉందని డిఫెన్స్‌ పీఆర్వో వెల్లడించారు.

అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో తవాంగ్ సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఇటీవలే కేదార్ నాథ్ లోనూ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. గాల్లోకి లేచిన కొన్ని క్షణాలలోనే హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.