
న్యూఢిల్లీ : ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కు అప్పగించింది. సోమవారం 140 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ ప్రాంగణంలో విధులు చేపట్టారు. వీరు ఇకపై పార్లమెంట్ లోపలికి వచ్చే, వెళ్లే అతిథులను, వారి లగేజీని తనిఖీ చేయనున్నారు. అలాగే, భవనానికి ఫైర్ సేఫ్టీ కవర్‌ను కూడా అందించనున్నారు. దేశంలోని ఎయిర్ పోర్టులకు ఇచ్చే సెక్యూరిటీని కొత్త, పాత పార్లమెంట్ భవనాలకు కల్పించనున్నారు. స్కానింగ్ యంత్రాలు, హ్యాండ్ డిటెక్టర్ల ద్వారా గెస్టుల వస్తువులను తనిఖీ చేస్తారు. వారి షూలను కూడా స్కాన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.